Ranbir Kapoor: కొందరు నటులు ఇంట్లో.. ప్రేక్షకులు కన్ఫ్యూజన్‌లో: రణబీర్‌

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎలా ఉందో వివరించారు. తన కొత్త చిత్రం ‘యానిమల్‌’ విశేషాలు పంచుకున్నారు.

Published : 08 Mar 2023 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పాండమిక్‌ తర్వాత చిత్ర పరిశ్రమలో మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం ఎక్కువ సినిమాలు రావడం లేదని బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఆవేదన వ్యక్తంచేశారు. చాలామంది నటులు ఇంట్లోనే ఉంటున్నారన్నారు. థియేటర్‌ సినిమా, ఓటీటీ సినిమా అనే కన్ఫ్యూజన్‌లో ప్రేక్షకులున్నారని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలోనూ కన్ఫ్యూజన్‌ నెలకొందని, మంచి కంటెంట్‌తో త్వరలోనే దాన్నుంచి బయటకొస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడారు. ప్రస్తుతం నటిస్తోన్న ‘యానిమల్‌’ (Animal) సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘‘యానిమల్‌’ కథ నన్ను కదిలించింది. అది నాకొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో సాగే తండ్రీకొడుకుల కథతో రూపొందుతోంది. నా నుంచి ప్రేక్షకులు ఊహించలేని విధంగా ఉంటుంది. ఇందులో నేను సవాల్‌ విసిరే పాత్రలో నటిస్తున్నా. దాని కోసం నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చా. ప్రస్తుతానికి ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నా. మరో సినిమాని అంగీకరించలేదు’’ అని రణ్‌బీర్‌ తెలిపారు. ఈయన హీరోగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రమే ‘యానిమల్‌’. రష్మిక కథానాయిక. అనిల్‌కపూర్‌, బాబీ డియోల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, రణ్‌బీర్‌ కథానాయకుడిగా రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో దర్శకుడు లవ్‌ రంజన్‌ రూపొందించిన ‘తూ ఝూఠీ.. మై మక్కార్‌’ (Tu Jhoothi Main Makkaar) మార్చి 8న విడుదలైంది. ఇందులో రణ్‌బీర్‌ సరసన శ్రద్ధా కపూర్‌ నటించింది. భవిష్యత్తులో.. ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌లో రణ్‌బీర్‌ నటించే అవకాశాలున్నాయని బాలీవుడ్‌లో వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు