Published : 08 Apr 2022 01:45 IST

Alia Bhatt: అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి ఈ సంప్రదాయంలో జరగనుందా.. హాజరు కానుంది వీళ్లేనా.?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్ఆర్ఆర్‌’లో సీతగా మెరిసి ఆ చిత్ర విజయంలో భాగస్వామి అయింది అలియాభట్‌. ఇప్పుడు అలియా జీవితంలో మరో అందమైన మైలురాయిని అందుకోబోతోంది. తన ప్రియుడు రణబీర్‌ కపూర్‌తో కలిసి త్వరలో పెళ్లి పీట లెక్కబోతోంది. ఏప్రిల్‌ 17న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగేళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాహ వేడుకను మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని ఇరువురు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెళ్లి వేడుకను ముంబయిలోని చెంబూర్‌ ప్రాంతంలో ఘనంగా నిర్వహించనున్నారు. అక్కడి ఆర్కే హౌస్‌ వేదికగా నాలుగురోజుల పాటు అంగరంగవైభవం వీరి కల్యాణ వేడుక జరగనుంది. పంజాబీ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులకు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందిందని తెలుస్తోంది. వీరిలో వరుణ్‌ ధావన్‌, రోహిత్‌ ధావన్‌, అయాన్‌ ముఖర్జీ, అర్జున్‌ కపూర్‌, ఆకాంక్ష రంజన్‌, అనుష్క రంజన్‌, మనీష్‌ మల్హోత్ర, కరీనా కుటుంబం హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల చివరిలో జరగనున్న రిసెప్షన్‌లో రణవీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, షారుక్‌ ఖాన్‌, ఆదిత్య చోప్రాలతో పాటుపలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని