రణ్‌బీర్‌-అలియా జంటకు నిరసనల సెగ

ప్రముఖ బాలీవుడ్ జంట రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor)‌-అలియాభట్‌(Alia Bhatt) ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’(Brahmāstra) ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా దేశం మొత్తం చిత్ర యూనిట్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా బ్రహ్మాస్త్ర టీం...

Updated : 15 Nov 2022 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్ జంట రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor)‌-అలియాభట్‌(Alia Bhatt) ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’(Brahmāstra) ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా దేశం మొత్తం చిత్ర యూనిట్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా బ్రహ్మాస్త్ర టీం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడి నిరసనకారుల నుంచి రణ్‌బీర్‌-అలియా జంటకు ప్రతికూలత ఎదురయ్యింది.

గతంలో రణ్‌బీర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహాకాళేశ్వర క్షేత్రం వద్ద ఈ దంపతులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిని ఆలయంలోకి అనుమతించకూడదంటూ నిరసనలు చేపట్టారు. తీవ్రత ఎక్కువ అవుతుండటంతో స్థానిక పోలీసులు రణ్‌బీర్‌-అలియాజంటను అక్కడినుంచి పంపించేశారు. ఈ దంపతులు ఆలయంలో సంధ్యపూజ చేయాల్సి ఉండగా, నిరసనల కారణంగా ఆ కార్యక్రమం పూర్తి చేయకుండానే వెనుదిరిగారు.

దాదాపు పది సంవత్సరాల క్రితం రణ్‌బీర్‌ ఒక ప్రైవేటు వీడియోలో తనకు బీఫ్‌ అంటే ఇష్టమని, తరచూ తింటుంటానని వ్యాఖ్యానించాడు. అతని మాటలకు వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.  అయితే బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ(Ayan Mukerji)ని ఆలయంలోకి అనుమతించడంతో అతడు మహాకాళి దర్శనం చేసుకుని, ఆ చిత్రాలను తన ఇన్‌స్టా ఖాతాలో ఉంచాడు. ‘ఎన్నో రోజుల నుంచి కాళీ మాతా దర్శనం కోసం ఎదురుచూస్తున్నా. దర్శనం అద్భుతంగా జరిగింది. మా సినిమా విడుదలవుతున్న సందర్భంగా మాపై కాళీ మాత దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ అయాన్‌ ముఖర్జీ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు.

ఈనెల(సెప్టెంబర్‌) 9న ‘బ్రహ్మాస్త్ర’ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంటగా నటించగా, అమితాబ్‌ బచ్చన్(Amitabh Bachchan)‌, నాగర్జున(Nagarjuna) కీలకపాత్రలు పోషించారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు