Animal: సెట్స్‌పైకి ‘యానిమల్‌’

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసి అక్కడా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడాయన రణ్‌బీర్‌

Updated : 23 Apr 2022 06:59 IST

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసి అక్కడా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడాయన రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘యానిమల్‌’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం హిమాలయాల్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇదొక విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమా కోసం రణ్‌బీర్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లోనే రెగ్యులర్‌ చిత్రీకరణ కొనసాగుతోంది. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని