ఆ పిల్లల కేరింతల్ని చూశా.. మర్చిపోలేని విజయం ఇది: రణ్‌బీర్‌కపూర్‌ భావోద్వేగం

ఒక సినిమా హిట్టు నాలుగు సినిమాల ఫట్టు అంటూ ఈ ఏడాది  బాలీవుడ్‌ ప్రయాణం సాగింది. గతనెలలో(ఆగస్టు) విడుదలైన పెద్ద స్టార్ల సినిమాలు సైతం ఈ పరిస్థితిని మార్చలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈనెల(సెప్టెంబరు)9న విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’(Brahmāstra)...

Updated : 15 Nov 2022 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ చిత్రానికి పెరుగుతున్న ప్రేక్షకాదరణపై  కథానాయకుడు రణ్‌బీర్‌కపూర్(‌Ranbir Kapoor) ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులతో కలిసి చూస్తూ, ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న రణ్‌బీర్‌ తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘విడుదలైనప్పటి నుంచి బ్రహ్మాస్త్రం చూస్తూనే ఉన్నా. ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి. ముఖ్యంగా థియేటర్‌లో మాకు దగ్గరగా కూర్చున్న ఇద్దరు పిల్లలు సినిమా చూస్తున్నంత సేపు కేరింతలు కొడుతూనే ఉన్నారు. ప్రారంభం నుంచి చివరివరకు వాళ్లిద్దరూ నిలబడే సినిమా చూశారు. మళ్లీ థియేటర్లు నిండుకోవడం, ప్రేక్షకుల సందడి చేయడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా  ఉంది. ఒక సినిమా ఇంత ఆనందాన్నివ్వడం నా జీవితంలో ఇదే తొలిసారి. దీనంతటికి కారణం ఈ చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji). ‘బ్రహ్మాస్త్రం’తో అతను అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. సినిమాపై అతనికున్న తపనకు నిదర్శనం ఇది. బ్రహ్మాస్త్రంను విజయవంతం చేస్తోన్న ప్రేక్షకులకు మా కృతజ్ఞతలు’ అంటూ భావోద్వేగం చెందాడు. 

దాదాపు రూ.400కోట్లతో తెరకెక్కిన ‘బ్రహ్మస్త్రం’ మూడు రోజుల్లోనే రూ.100కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్ట్టినట్లు సమాచారం. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan)‌‌, షారుఖ్‌ఖాన్(Shah Rukh Khan)‌, నాగార్జున(Nagarjuna) కీలకపాత్రలు పోషించారు. అత్యాధునిక గ్రాఫిక్స్‌ హంగులతో, 3డీలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని