Ranbir Kapoor: ‘రణ్‌బీర్‌ నీకు బుద్ధుందా..? అప్పట్లో కత్రినాని ఇప్పుడు ఆలియాని’

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌పై (Ranbir Kapoor) సోషల్‌మీడియా యూజర్స్‌ మండిపడుతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ప్రమోషన్స్‌లో....

Updated : 20 Aug 2022 15:19 IST

బాలీవుడ్‌ నటుడిపై మండిపడుతున్న సోషల్‌మీడియా యూజర్స్‌

ముంబయి‌: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌పై (Ranbir Kapoor) సోషల్‌మీడియా యూజర్స్‌ మండిపడుతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ప్రమోషన్స్‌లో పాల్గొన్న తన సతీమణి, నటి ఆలియాభట్‌ని (Alia Bhatt) కించపరుస్తూ రణ్‌బీర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రణ్‌బీర్‌ నీకసలు బుద్ధుందా..?’ అంటూ పోస్టులు పెడుతున్నారు. రణ్‌బీర్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏమిటంటే..?

రణ్‌బీర్‌ కపూర్‌ - ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బ్రహ్మాస్త్ర’. ఆయాన్‌ ముఖర్జీ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌ నిర్మిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆయాన్‌ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్‌ పూర్తి స్థాయిలో జరగడం లేదెందుకు?’’ అని ప్రశ్నించాడు. 

ఆలియా స్పందిస్తూ.. ‘‘త్వరలోనే అన్ని ప్రాంతాలకు వెళ్లి మా చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తాం. మా చిత్రాన్ని భారీగా ఎందుకు ప్రమోట్‌ చేయడం లేదని మీరు అడుగుతున్నారు. అయితే ప్రస్తుతానికి మా దృష్టి మొత్తం..’’ అని చెబుతుండగా మధ్యలో రణ్‌బీర్‌ అందుకుని ఆలియా బేబీ బంప్‌ వైపు చూస్తూ.. ‘‘మా చిత్రాన్ని మేం ఎందుకు ప్రమోట్‌ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’’ అని చెప్పాడు. ఆయన మాటతో ఆలియా ఒక్కసారిగా షాకై చిన్నబుచ్చుకున్నారు. దీంతో రణ్‌బీర్‌.. ‘‘నేను కేవలం జోక్‌ చేశానంతే’’ అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు. 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో దీన్ని చూసిన నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రణ్‌బీర్‌ నీకు బుద్ధుందా..?’, ‘కడుపులో బిడ్డ ఉన్నప్పుడు కూడా భార్య నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా?’, ‘ఆలియా.. నువ్వు తప్పు చేశావు. నీకింతకంటే మంచి వ్యక్తి వచ్చేవాడు’, ‘నాకిప్పటికీ గుర్తు.. ‘జగ్గా జూసూస్‌’ ప్రమోషన్స్‌లో రణ్‌బీర్‌.. కత్రినానుద్దేశించి హేళనగా మాట్లాడాడు. అందరి ముందు ఆమె లుక్స్‌ని కించపరిచాడు. ఇప్పుడు ఆలియా భట్‌ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్నాడు’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్‌ పెట్టారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు