Brahmastra: ఓటీటీ విడుదలకూ ప్రచారం.. ఆసక్తిగా రణ్‌బీర్‌ కపూర్‌ వీడియో..

బ్రహ్మాస్త్ర సినిమా నవంబర్‌ 4 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ తనదైన శైలిలో ప్రచారం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 27 Oct 2022 01:04 IST

హైదరాబాద్‌: రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా నవంబరు 4 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar) వేదికగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.  ఓటీటీ కోసం ఈ చిత్ర ప్రమోషన్‌ను రణ్‌బీర్‌ సింగ్‌ ఆసక్తికరంగా చేశారు. ఆ వీడియోను అలియా తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అందులో రణ్‌బీర్‌ మొదట ‘నేను ప్రమోషన్స్ చెయ్యను’ అన్నట్లు మాట్లాడతాడు. మళ్లీ సినిమా దర్శకుడు ఫోన్‌ చేయగానే ‘అలాగే సర్‌ కచ్చితంగా ప్రమోషన్స్‌ చేద్దాం’ అని చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అలియా షేర్‌ చేసిన వీడియోలో రణ్‌బీర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో డాన్స్‌ చేయడం కోసం నేను దెయ్యంలా మారాను. ఇక ప్రతి ఈవెంట్‌లో ‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా..’ పాట పాడి అలియా తన గొంతు కొల్పోయినంత పనైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎన్నో ప్రయాణాలు చేశాం. ఎన్నో స్వీట్స్‌ పంచాం. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంటే నేనేం చేయాలి.. అందరి ఇళ్లకు వెళ్లి బ్రహ్మాస్త్ర సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో వస్తుంది అందరూ చూడండి అని చెప్పాలా’’ అని కోపంగా అంటాడు. మళ్లీ దర్శకుడు ఫోన్‌ చేయగానే ‘‘కచ్చితంగా ప్రమోషన్స్‌ చేయాలి సర్‌..’’ అని మాట్లాడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏదిఏమైనా ఇలా కొత్తగా ప్రమోషన్స్‌ చేయడం రణ్‌బీర్‌కే సాధ్యం అంటున్నారు. మరి ఆ సరదా ప్రమోషన్‌ మీరూ చూసేయండి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని