Brahmastra: రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర’కు డబ్బులు తీసుకోలేదా...!

రణబీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ కీలక పాత్రల్లో నటించారు.

Updated : 23 Sep 2022 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ సినిమా బడ్జెట్‌, కలెక్షన్స్‌ విషయంలో రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ పెరిగిపోవడంతో.. అలియా, రణ్‌బీర్‌ ఇద్దరూ వారి పారితోషికాలను వదులుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా దర్శకుడు అయాన్‌ వీటిపై స్పందించారు.

‘‘చాలా మంది వ్యక్తిగత త్యాగాల వల్ల ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్‌ డబ్బులు తీసుకోలేదు. ఇది చాలా పెద్ద విషయం. ఇక అలియా విషయానికొస్తే తను ఈ ప్రాజెక్టులో 2014లో జాయిన్‌ అయ్యింది.  అలియాకు ఈ సినిమా కోసం ఇచ్చిన పారితోషికం తను ఇప్పుడు తీసుకుంటున్న దానికి చాలా తక్కువ.  మేము ఈ సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది’’ అన్నారు. ఇక రణ్‌బీర్‌ కపూర్ మాట్లాడుతూ..‘‘నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. కానీ నేను అంతకు మించి పొందాను. ఒక నటుడిగా నేను ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఒకరన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని