Ranbir Kapoor: ఆరోజు నేను చేసిన పనికి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది: రణ్‌బీర్ కపూర్
ముంబయి: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చేసిన ఓ పని వల్ల తన తల్లి నీతూకపూర్ (Neetu Kapoor) కన్నీళ్లు పెట్టుకుందని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) తెలిపారు. నటుడిగా కెరీర్ ప్రారంభించడానికంటే ముందు తాను కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశానని.. అప్పుడు జరిగిన ఓ ఘటనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘నటుడిగా నేను నా కెరీర్ ప్రారంభమైంది ‘సావరియా’తోనే అయినప్పటికీ.. అంతకంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే పరిశ్రమలో ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు వర్క్ చేశాను. నాన్న రిషికపూర్ హీరోగా నటించిన ‘ప్రేమ్ గ్రంథ్’కి అసిస్టెంట్‌గా పనిచేసినందుకు రూ.250 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. తొలి సంపాదన అందుకున్న ఆనందంలో ఇంటికి వెళ్లి ఆ డబ్బుని మా అమ్మ పాదాలపై పెట్టాను. ఆ క్షణం అమ్మ నన్ను చూసి ఉద్వేగానికి లోనైంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది’’ అని ఆనాటి రోజుల్ని రణ్‌బీర్ గుర్తు చేసుకున్నారు.
ఇక, ప్రస్తుతం రణ్‌బీర్ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ఒకటి.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’. ధర్మా ప్రొడెక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈసినిమా మూడు భాగాలుగా విడుదల కానుంది. మరోవైపు రణ్‌బీర్ ద్విపాత్రాభినయం పోషించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆయన పై విషయాన్ని బయటపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kejriwal: ఒకే ఒక్క అడుగు.. అది వేస్తే మనమూ సాధించినట్లే..!
-
General News
Wayanad Collector: ఇంట్లో ఉండటం చాలా కష్టం..! విద్యార్థిని ఈమెయిల్ వైరల్
-
General News
TTD: ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. తితిదే విజ్ఞప్తి
-
India News
UP: మహిళపై వేధింపులు.. పరారీలో ఉన్న భాజపా నేత అరెస్టు!
-
Politics News
Bihar politics: నీతీశ్‌పై మండిపడిన చిరాగ్.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
-
India News
PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరజ్ చోప్రా
- ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్