Ranbir Kapoor: నేను ఆ అవార్డుకు అర్హుడిని కాను..: రణ్‌బీర్‌ కపూర్‌

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తనకు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF)’లో ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించాడు. 

Published : 23 Feb 2023 19:38 IST

ముంబయి: బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తనకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు రావడంపై స్పందించాడు. ఈ అవార్డుకు తాను పూర్తిగా అర్హుడిని కానని చెప్పాడు. గతేడాది విడుదలైన ‘బ్రహ్మాస్త్రం’ (Brahmastra) సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటనకు గాను దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF)లో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రణ్‌బీర్‌ దీని గురించి మాట్లాడారు.

‘‘నాకు ఇంత గొప్ప అవార్డు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కానీ దీనికి నేను పూర్తిగా అర్హుడిని కాదని నా అభిప్రాయం. ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో నాకంటే గొప్పగా చేసిన నటులు ఎంతోమంది ఉన్నారు’’ అని చెప్పాడు. అలాగే ఓ రిపోర్టర్‌ ‘ప్రస్తుతం బాలీవుడ్‌ పరిస్థితి బాలేదు కదా..?’ అని అడగ్గా రణ్‌బీర్‌ ఆ ప్రశ్నకు కొంచెం ఘాటుగా సమాధానం చెప్పాడు. ‘‘ఏం మాట్లాడుతున్నారు. మీరు ఏ మీడియా నుంచి వచ్చారు. ‘పఠాన్‌’ సినిమా చూడలేదా. ఆ సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఆసినిమా కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది’’ అని తెలిపాడు.

ఇంకా రణ్‌బీర్‌ మాట్లాడుతూ తన కూతురు గురించి ప్రస్తావించాడు. ఆమె పుట్టిన తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాడు. ఆమెను మొదటిసారి చూసి ఎత్తుకున్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మరవలేనని అన్నాడు. ఇక 2022లో తనకు కొన్ని సినిమాలు, కొందరి నటన ఎంతో నచ్చాయని చెప్పాడు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ నటన, గంగూబాయి కాఠియావాడిలో అలియా భట్‌ (Alia Bhatt) యాక్షన్‌ తనని ఎంతో ఆకర్షించాయన్నాడు. అలాగే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అద్భుతం సృష్టించాడని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని