Allu Arjun: ‘పుష్పరాజ్‌’ లాంటి పాత్రలే నాకూ వస్తే బాగుండేది: బాలీవుడ్‌ ప్రముఖ హీరో

‘పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) పాత్రలాంటివి చేయాలని ఉందని బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) అన్నాడు. ఓ ప్రేక్షకుడిగా, నటుడిగా తనను కొన్ని సినిమాలు ఎంతో ప్రభావితం చేశాయని చెప్పాడు.

Published : 26 Feb 2023 14:07 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) కెరీర్‌లోనే సూపర్‌ హిట్‌గా నిలిచింది ‘పుష్ప’ (Pushpa) సినిమా. ఈ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడీ ఐకాన్ స్టార్‌. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్‌ పాత్రతో అందరినీ మెప్పించాడు బన్నీ. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ‘పుష్ప’లో హీరో పాత్రపై ఓ కామెంట్‌ చేశాడు. దీన్ని బన్నీ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. 

ఇటీవల దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF)లో ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌కు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడాడు. గతేడాదిలో నచ్చిన సినిమాల గురించి ప్రస్తావించిన రణ్‌బీర్‌.. తనకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ పోషించినటువంటి పాత్రలో నటించాలని ఉందంటూ కోరికను వ్యక్తం చేశాడు. ‘‘గంగూబాయి కాఠియావాడి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ , ‘పుష్ప’ సినిమాలు ఓ ప్రేక్షకుడిగా, నటుడిగా నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నాకూ పుష్పరాజ్‌ లాంటి పాత్రలు వచ్చి ఉంటే చాలా బాగుండేది’’ అని అన్నాడు. 
అలాగే గతంలో పాకిస్థానీ చిత్రాలు చేయాలనుందని రణ్‌బీర్‌ చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు. ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ.. ‘‘నేను వెళ్లిన కార్యక్రమంలో చాలామంది పాకిస్థానీ చిత్ర నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. ‘మంచి కథలు ఉంటే పాకిస్థాన్‌ చిత్రాల్లో నటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా’ అని వారు నన్ను ప్రశ్నించారు. సినిమాకు, కళకు ఎలాంటి హద్దులు ఉండవని నేను భావిస్తాను. అందుకే ఆ సినిమాల్లో నటిస్తానని చెప్పా. కానీ, కొందరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని రణ్‌బీర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని