Ranbir Kapoor: వీరోచితంగా రణ్‌బీర్‌ ‘షంషేరా’ టీజర్‌!

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) నటిస్తోన్న సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘షంషేరా’ (Shamshera). కరణ్‌ మల్హోత్ర దర్శకుడు. ఇప్పటిక...

Published : 23 Jun 2022 01:39 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటిస్తున్న సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘షంషేరా’ (Shamshera). కరణ్‌ మల్హోత్రా దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్‌ సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పోరాట యోధుడు, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే ఒక వీరుడిగా రణ్‌బీర్‌ నటన, ఆహార్యం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని