Aliabhatt: రణ్‌బీర్ సర్‌ప్రైజ్.. బేబీ అంటూ హత్తుకున్న ఆలియా
బాలీవుడ్ నటి, తన సతీమణి ఆలియాభట్‌ను(Aliabhatt) నటుడు రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor) సర్‌ప్రైజ్ చేశారు. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart Of Stone) షూట్ ముగించుకుని శనివారం రాత్రి ముంబయికి వచ్చిన...
వీడియోలు వైరల్
ముంబయి: బాలీవుడ్ నటి, తన సతీమణి ఆలియాభట్‌ను(Aliabhatt) నటుడు రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor) సర్‌ప్రైజ్ చేశారు. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart Of Stone) షూట్ ముగించుకుని శనివారం రాత్రి ముంబయికి వచ్చిన ఆమె కోసం రణ్‌బీర్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలా రావడంతో ఆలియా ఒక్కసారిగా ఆనందానికి లోనయ్యారు. ‘బేబీ’ అని పిలుస్తూ ఆయన్ని హత్తుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌కపూర్-ఆలియాభట్ ఈ ఏడాదిలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాము త్వరలో తల్లిదండ్రులు కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆలియా తన తదుపరి ప్రాజెక్ట్స్‌ని వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరుస షూట్స్‌లో పాల్గొంటున్నారు. అలా, ఆలియా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న తొలి చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూట్ నిమిత్తం కొన్నిరోజులుగా ఆమె యూరప్‌లోనే ఉన్నారు. ఈక్రమంలోనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబయికి తిరిగి వచ్చారు. ఆ సమయంలోనే రణ్‌బీర్.. ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. మరోవైపు రణ్‌బీర్ సైతం తన తదుపరి సినిమా ‘షంషేరా’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘పూజారులపై దాడి చేస్తే ఏమైంది?’
-
‘విస్తరణ’ దారిలో విపరీత బుద్ధులు!
-
ఖరము పాలు ఖరీదు గురూ!
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!