Randhir Kapoor: రణ్‌బీర్‌తో నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు: రణ్‌ధీర్‌ కపూర్‌

తన అంకుల్‌, నటి కరీనా కపూర్‌ తండ్రి, సీనియర్‌ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌ మతిమరుపుతో బాధపడుతున్నారంటూ ఇటీవల బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ చేసిన వ్యాఖ్యలు బీటౌన్‌ అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రణ్‌ధీర్‌ ఆరోగ్యం గురించి...

Published : 03 Apr 2022 12:38 IST

నాకెలాంటి మతిమరుపు లేదు: సీనియర్‌ నటుడు

ముంబయి: తన అంకుల్‌, నటి కరీనా కపూర్‌ తండ్రి, సీనియర్‌ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌ మతిమరుపుతో బాధపడుతున్నారంటూ ఇటీవల బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ చేసిన వ్యాఖ్యలు బీటౌన్‌ అంతటా చర్చనీయాంశంగా మారాయి. దీంతో రణ్‌ధీర్‌ ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న వార్తలపై రణ్‌ధీర్‌ స్పందించారు. రణ్‌బీర్‌ చెప్పిన దానిలో నిజం లేదని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ‘‘నాకు మతిమరుపు లేదు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాను. గతంలో ఓసారి కొవిడ్‌ వచ్చింది. కోలుకున్నాను. రణ్‌బీర్‌ ఏదైతే చెప్పాడో అది తన వ్యక్తిగతం’’ అని స్పష్టం చేశారు.

రిషి కపూర్‌ నటించిన చివరి చిత్రం ‘శర్మాజీ నమ్‌కిన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ‘‘శర్మాజీ నమ్‌కిన్‌’ చిత్రాన్ని పెదనాన్న (రణ్‌ధీర్‌ కపూర్‌) చూశారు. ఆ సినిమా తర్వాత ఆయన నా వద్దకు వచ్చి.. ‘సినిమాలో నాన్న బాగా నటించారు. ఒక్కసారి నాన్నని పిలువు తనతో మాట్లాడతా’ అని చెప్పారు. నాన్న చనిపోయిన విషయం ఆయన మర్చిపోయారు. ఎందుకంటే ఆయనకు మతిమరుపు ప్రారంభదశలో ఉంది’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని