Rang De:‘రంగ్ దే’ ఆ ఓటీటీలో మాత్ర‌మే

ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ‘రంగ్ దే’ ఓటీటీ విడుద‌ల తేదీ ఖ‌రారైంది. ప్ర‌ముఖ ఓటీటీ జీ5లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్  కానుంది. ఈ మేర‌కు ట్వీట్ చేసింది చిత్రబృందం.

Published : 28 May 2021 19:34 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ‘రంగ్ దే’ ఓటీటీ విడుద‌ల తేదీ ఖ‌రారైంది. ప్ర‌ముఖ ఓటీటీ జీ5లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్  కానుంది. ఈ మేర‌కు ట్వీట్ చేసింది చిత్రబృందం. మీరు ఎంత‌గానో ఎదురుచూస్తోన్న రంగు రంగుల ప్రేమ ఇంద్ర‌జాలం ‘రంగ్ దే’ జూన్‌ 12 నుంచి జీ 5లో మాత్ర‌మే.. అని పేర్కొంది. నితిన్‌, కీర్తి సురేశ్ జంట‌గా తెర‌కెక్కిన సినిమా ఇది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. మార్చి 26న థియేట‌ర్ల‌లో విడుద‌లై సంద‌డి చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని