‘రంగ్‌ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు

నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రం ‘రంగ్‌ దే’. గివ్‌ మీ సమ్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. వెంకీ అట్లూరి దర్శకుడు. తాజాగా చిత్రీకరణ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది చిత్రబృందం. ఈ మేరకు సెట్‌లో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నితిన్‌, కీర్తి సురేశ్‌, దర్శకుడు వెంకీ, సీనియర్‌ నటుడు నరేశ్‌, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌, ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు.

Published : 25 Feb 2021 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రం ‘రంగ్‌ దే’. గివ్‌ మీ సమ్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. వెంకీ అట్లూరి దర్శకుడు. తాజాగా చిత్రీకరణ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది చిత్రబృందం. ఈ మేరకు సెట్‌లో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నితిన్‌, కీర్తి సురేశ్‌, దర్శకుడు వెంకీ, సీనియర్‌ నటుడు నరేశ్‌, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌, ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘రంగ్‌ దే చిత్రీకరణ పూర్తయింది. మీకు వినోదం పంచేందుకు ఈ హోలీ వస్తున్నాం’ అని అన్నారు దర్శకుడు వెంకీ. ‘ఎన్నో నవ్వులు అందించిన ఈ చిత్ర బృందాన్ని మిస్‌ అవుతున్నాను’ అన్నారు కీర్తి సురేశ్‌.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన ‘చెక్‌’ ఈ నెల 26న విడుదలవుతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నాయికలు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని