Ranga Ranga Vaibhavanga: తెలుసా.. తెలుసా!

‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించారు కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌. ఇప్పుడాయన.. కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Feb 2022 07:01 IST

‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించారు కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌. ఇప్పుడాయన.. కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్య క్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈనెల 3న ‘‘తెలుసా.. తెలుసా’’ అనే పాట విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ట్విటర్‌   వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ ప్రచార చిత్రంలో వైష్ణవ్‌, కేతిక రొమాంటిక్‌ లుక్‌లో చూడముచ్చటగా కనిపించారు. ‘‘యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. వైష్ణవ్‌, కేతికల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ దత్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని