Updated : 08 May 2022 10:27 IST

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ... పాట వైభవంగా

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా...’. కేతికాశర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాని జులై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఈ చిత్రంలోని ‘కొత్తగా లేదేంటి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఆర్మాన్‌ మాలిక్‌, హరిప్రియ ఆలపించిన ఈ పాటని శ్రీమణి రచించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘ప్రేమ పాట ఇది. ప్రేమికులకి బాగా కనెక్ట్‌ అయ్యేలా స్వరపరిచారు సంగీత దర్శకుడు దేవిశ్రీ    ప్రసాద్‌. పాటకి చక్కటి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి శ్యామ్‌దత్‌ ఛాయాగ్రాహకుడు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని