Updated : 27 Jun 2022 13:10 IST

Ranga Ranga Vaibhavanga: ‘ఖుషి’ని గుర్తుచేస్తోన్న ‘రంగ రంగ వైభవంగా’ టీజర్‌

హైదరాబాద్‌: ‘‘నన్నే చూస్తావ్‌.. నా గురించే కలలు కంటావ్‌.. కానీ, నీకు నాతో మాట్లాడటానికి ఇగో’’ అని నటుడు వైష్ణవ్‌ తేజ్‌ని(Vaishnav Tej) ఉద్దేశించి అంటున్నారు నటి కేతికాశర్మ (Ketika Sharma). వీరిద్దరూ కలిసి నటించిన లవ్లీ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga ). గిరీశయ్య దర్శకుడు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చక్కటి ప్రేమకథతో సిద్ధమైన ఈ సినిమాలో వైష్ణవ్‌ రిషిగా, కేతిక రాధగా నటించారు. వీళ్లిద్దరూ తరచూ గొడవలు పడటం.. ఇగోతో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను బయటపెట్టకపోవడం.. ఇలా పలు సన్నివేశాలు చూస్తే పవన్‌కల్యాణ్‌ నటించిన యూత్‌ఫుల్‌ సినిమా ‘ఖుషి’ గుర్తుకు వస్తుంది. టీజర్‌ చివర్లో వచ్చే డైలాగ్‌లు యువతను అలరించేలా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీన్ని నిర్మించారు.

టీజర్‌ లాంఛ్‌ కార్యక్రమంలో భాగంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానాలివే..

ఈ టీజర్ చూస్తుంటే మాకు ‘ఖుషి’ గుర్తుకువచ్చింది. మీరు పవన్‌కల్యాణ్‌ ఫ్యానా?

గిరీశయ్య: అవునండి. పవన్‌కి నేను పెద్ద అభిమానిని. ‘ఖుషి’ చిత్రాన్ని భీమవరం విజయలక్ష్మి థియేటర్‌లో 38 సార్లు చూశా. నేను ఇప్పటివరకూ ఎక్కువసార్లు చూసిన సినిమా అదే.

పోలీస్‌, యాక్షన్‌ కథా చిత్రాల్లో మీరు నటిస్తారా?

వైష్ణవ్‌తేజ్‌: అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.

చిన్నప్పుడు మీరేం కావాలని కలలు కన్నారు?

వైష్ణవ్‌: శాస్త్రవేత్తను కావాలనుకున్నా. అబ్దుల్‌కలాం గారు నాకెంతో స్ఫూర్తి. బైపీసీ వరకూ చదివాను. దాని తర్వాత కుదరలేదు.

కేతిక: నేను డాక్టర్స్‌ కుటుంబం నుంచే వచ్చాను. నా తల్లిదండ్రులు నన్నూ ఓ డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ నేను నటిని కావాలనుకుంటున్నానని చెప్పాను. వాళ్లు సపోర్ట్‌ చేశారు.

ఈ సినిమాలోని ఏ సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు?

వైష్ణవ్‌: సత్య కామెడీ సీన్స్‌ నా ఫేవరెట్‌. ఈసినిమాకు ఆయన కామెడీ ఎపిసోడ్‌ హైలైట్‌.

మీరు ముందే ఎందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు?

వైష్ణవ్‌ తేజ్‌: నేను సరైన వయసులో పరిశ్రమలోకి వచ్చాననుకుంటున్నా. 25, 26 ఏళ్ల వయసులోనే ఎంట్రీ  ఇచ్చాను. అయినా నేను సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు. ఇన్‌స్టాలో ఏదో ఫొటో పెడితే అది చూసి బుచ్చిబాబు ఓకే చేయడంతో ‘ఉప్పెన’లో నటించా. ఆ సినిమా అప్పుడు నా వయసు 25.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts