అందరికీ నచ్చే ‘రంగ రంగ వైభవంగా’ వైష్ణవ్‌ తేజ్‌

వైష్ణవ్‌ తేజ్‌, కేతికశర్మ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం

Updated : 28 Jun 2022 13:53 IST

వైష్ణవ్‌ తేజ్‌, కేతికశర్మ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘టీజరే కాదు.. సినిమా కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండగా నిలిచిన చిత్ర బృందానికి, ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇక్కడి వరకు రావడానికి కారణం వైష్ణవ్‌ తేజ్‌. ఒక హీరోను కలిసి కథ చెప్పడమంటే చాలా కష్టం. కానీ, ఒక్క ఫోన్‌కాల్‌తో ఆయన నన్ను కలిసి కథ విన్నారు. తన ఎనర్జీ మరో స్థాయిలో ఉంటుంది. కేతిక కళ్లు చూడగానే.. ఆమెనే నా రాధ అని ఫిక్సయిపోయా. తను ఆ పాత్ర అద్భుతంగా చేసింది. దేవిశ్రీ మంచి పాటలు, శ్యామ్‌ చక్కటి విజువల్స్‌ ఇచ్చారు. సినిమా చూశాక ‘నా సామి రంగా.. రంగ రంగ వైభవంగా’ అని ప్రేక్షకులు ఫీలవుతారు’’ అన్నారు దర్శకుడు. ‘మంచి ఫీల్‌ గుడ్‌ చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇంత మంచి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’ అంది కేతిక. ‘‘మంచి సినిమా చేశాం. ఈ చిత్రం చూశాక అబ్బాయిలందరూ కేతికతో ప్రేమలో పడతారు’’ అన్నారు నటుడు నవీన్‌ చంద్ర. ‘‘మెగా హీరోలందరితో సినిమాలు చేశా. ఇప్పుడు వైష్ణవ్‌తో చేశాను. అన్ని సినిమాలు విజయవంతమైనట్లే.. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు చిత్ర నిర్మాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని