Rangabali Teaser: ‘రంగబలి’ హంగామా
కుర్రాడు నాజూకు అనుకుంది ఆ అమ్మాయి. కానీ అతని అసలు స్వరూపం వేరు. మన ఊళ్లో మనల్నెవడ్రా ఆపేది అంటూ ఆ కుర్రాడు చేసిన హంగామా ఎలాంటిది? అలాంటి అబ్బాయితో ప్రేమలో పడిన అమ్మాయి కథేమిటో తెలియాలంటే ‘రంగబలి’ చూడాల్సిందే.
కుర్రాడు నాజూకు అనుకుంది ఆ అమ్మాయి. కానీ అతని అసలు స్వరూపం వేరు. మన ఊళ్లో మనల్నెవడ్రా ఆపేది అంటూ ఆ కుర్రాడు చేసిన హంగామా ఎలాంటిది? అలాంటి అబ్బాయితో ప్రేమలో పడిన అమ్మాయి కథేమిటో తెలియాలంటే ‘రంగబలి’ చూడాల్సిందే. నాగశౌర్య కథానాయకుడిగా ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. యుక్తి తరేజా కథానాయిక. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. గురువారం సినిమా టీజర్‌ని విడుదల చేశారు. నాగశౌర్య క్లాస్‌గా కనిపించే మాస్ కుర్రాడిగా చేసిన సందడి టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. ‘‘వాణిజ్య హంగులతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్, రొమాంటిక్ అంశాలు, హాస్యం చిత్రానికి ప్రధాన బలం. జులై 7న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపాయి సినీ వర్గాలు. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, ఛాయాగ్రహణం: దివాకర్ మణి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: ఏఎస్ ప్రకాశ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్