Rangamarthanda: ‘రంగమార్తాండ’ను మెచ్చిన దర్శకులు.. సినిమా విడుదల ఆ రోజే

దర్శకుడు కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే?

Published : 16 Mar 2023 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలకానుంది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్‌ విడుదల చేసింది. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్‌సామ్రాట్’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రంగస్థల కళాకారుల జీవితం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, అలీ రెజా, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రత్యేక షో ద్వారా ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు అద్భుతంగా ఉందంటూ కృష్ణవంశీకి కితాబిచ్చారు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర భావోద్వేగానికి గురిచేస్తుందన్నారు. దర్శకులు శేఖర్‌ కమ్ముల, హరీశ్‌ శంకర్‌, బి. గోపాల్‌, దేవ కట్టా, బుచ్చిబాబు, నందిని రెడ్డి, తేజ,  అనుదీప్‌ కె. వి. తదితరులు ‘రంగమార్తాండ’ ప్రీమియర్‌ చూసి, తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం విభిన్న క్యారెక్టర్‌ ప్లే చేయడం, భారీ తారాగణం, ప్రముఖ హీరో చిరంజీవి ఓ షాయరీ ఆలపించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని