Tollywood: ‘రంగస్వామి’ సందేశం

నరసింహాచారి, డా.సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రంగస్వామి’. మీనాక్షి రెడ్డి, పల్సర్‌ బైక్‌ ఝన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నరసింహాచారి స్వీయ దర్శనిర్మాణంలో నిర్మించారు.

Updated : 31 Mar 2023 07:00 IST

రసింహాచారి, డా.సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రంగస్వామి’ (Rangaswamy). మీనాక్షి రెడ్డి, పల్సర్‌ బైక్‌ ఝన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నరసింహాచారి స్వీయ దర్శనిర్మాణంలో నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నటుడు సుమన్‌ (Suman) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమాని చూశాకే ట్రైలర్‌ని విడుదల చేశా. మత్తు మందు వినియోగించే యువత ఎన్ని రకాల ఇబ్బందులకి గురవుతోందో ఇందులో బాగా చూపించారు. యువతరానికి మంచి సందేశాన్నిచ్చే చిత్రమిది. భావోద్వేగాలు, థ్రిల్లింగ్‌ అంశాలు చాలా బాగున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు చూశాక... ఇలాంటి చిత్రంలో నటించలేకపోయానే అనే బాధ కలిగింది. ఇలాంటి కథలు సమాజానికి చాలా అవసరం’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని