మహేష్‌ రిలీజ్‌ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్‌!

నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా ‘రంగ్‌దే’చిత్రం తుది రూపు దిద్దుకుంటోంది. వెంకీ అట్లూరి దర్వకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో తన రంగులను చల్లనుంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా ‘నా కనులే కనని..’ అంటూ

Published : 04 Mar 2021 19:56 IST

హైదరాబాద్‌: నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా ‘రంగ్‌దే’చిత్రం తుది రూపు దిద్దుకుంటోంది. వెంకీ అట్లూరి దర్వకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో తన రంగులను చల్లనుంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా ‘నా కనులే కనని..’ అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చగా, సిధ్‌ శ్రీరామ్‌ తన మ్యాజికల్‌ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. శ్రీమణి మనసుకు హత్తుకునే సాహిత్యాన్ని అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవరనాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాయిగా సాగిపోతున్న ఈ ఫీల్‌గుడ్‌ ప్రేమగీతాన్ని మీరు చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని