‘చూసి నేర్చుకోవద్దంటున్నా..’ నితిన్‌!

నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో నితిన్‌ పెళ్లి తర్వాత మగవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా చూపించబోతున్నారు. అలాగే భావోద్వేగాలను కూడా అంతేస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే

Published : 13 Mar 2021 20:34 IST

హైదరాబాద్‌: నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో నితిన్‌ పెళ్లి తర్వాత మగవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా చూపించబోతున్నారు. అలాగే భావోద్వేగాలను కూడా అంతేస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమాలో ఇంట్రో సాంగ్‌లా అనిపిస్తున్న ‘చూసి నేర్చుకోకు..’అంటూ సాగుతున్న పాట ప్రోమోను విడుదల చేశారు. మంచి డ్యాన్స్‌ మూవ్స్‌తో నితిన్‌ ఇరగదీస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌  పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి పని చేస్తుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న  ఈ చిత్రం మార్చి 26  ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లేటెందుకు ఆ ప్రోమోను మీరు చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు