Ante Sundaraniki: ‘రంగో రంగా’.. సుందరం కష్టాలు చూశారా..!

అతను అనుకున్నదొకటి, అయ్యిందొకటి. మొక్కిందొకటి, దక్కింది మరొకటి. కాలం కూడా ఆయనకు కలిసిరాదు. అన్నీ దక్కినట్టే దక్కి వెనక్కి వెళ్లిపోతుంటాయి.

Updated : 23 May 2022 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతను అనుకున్నదొకటి, అయ్యిందొకటి. మొక్కిందొకటి, దక్కింది మరొకటి. కాలం కూడా ఆయనకు కలిసిరాలేదు. అన్నీ దక్కినట్టే దక్కి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ కష్టాలెవరివో కాదు సుందరానివి. సుందరం ఎవరంటారా? ఇంకెవరు యువ నటుడు నాని (Nani). ఈయన హీరోగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki). నాని టైటిల్‌ పాత్ర పోషించిన ఈ సినిమాలో నజ్రియా ఫహద్‌ కథానాయిక. ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ‘రంగో రంగా’ (Rango Ranga) అనే గీతాన్ని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో కథానాయకుడు పడిన కష్టాలేంటో తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘శనపతి భరద్వాజ్ పాత్రుడు’ రాసిన ఈ గీతాన్ని ఎన్‌.సి. కారుణ్య ఆలపించారు. వివేక్‌ సాగర్‌ స్వరాలందించారు. గాయకుడు కారుణ్య ప్రదర్శనతోపాటు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని