25 రోజులు.. 75 మిలియన్స్‌‌.. సెన్సేషనల్‌ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ ఇదే

విజయ్‌ హీరోగా సిద్ధమవుతోన్న చిత్రం ‘వారిసు’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈసినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ విడుదలైంది.

Updated : 30 Nov 2022 10:34 IST

హైదరాబాద్‌: ‘రంజితమే.. రంజితమే’.. ఇప్పుడు తమిళ సినీ ప్రియులతో డ్యాన్స్‌ చేయిస్తోన్న పాట ఇది. కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) నటించిన ‘వారిసు’ (Varisu)లోని ఈ పాట విడుదలైన 25 రోజుల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పుడిదే పాటకు తెలుగు వెర్షన్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ‘రంజితమే’ అంటూ సాగే ఈ తెలుగు పాటకు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో విజయ్‌ పాడిన ఈ పాటను తెలుగులో అనురాగ్‌ కులకర్ణి, ఎం.ఎం.మానసి ఆలపించారు. ఇక, తమన్‌ అందించిన మ్యూజిక్‌ యూత్‌తో డ్యాన్స్‌ చేయించేలా ఉంది.

‘బీస్ట్‌’ తర్వాత విజయ్ నటిస్తోన్న చిత్రమిది. వంశీపైడిపల్లి దర్శకుడు. రష్మిక (Rashmika) కథానాయిక. దిల్‌ రాజు నిర్మాత. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా షూట్‌ శర వేగంగా జరుగుతోంది. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్‌, శ్రీకాంత్‌, ప్రభు కీలకపాత్రలు పోషిస్తున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు