Ranveer Singh: ఆ శక్తి ఉంది

అగ్రకథానాయకుల సినిమా అంటే అభిమానులంతా మంచి యాక్షన్‌ సినిమానే కోరుకుంటారు. అందుకే ఎక్కువ సార్లు అలాంటివే  తీసినా  అప్పుడప్పుడు సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ప్రయోగాలు చేస్తుంటారు కథానాయకులు. ప్రస్తుతం రణ్‌వీర్‌...

Updated : 13 May 2022 13:51 IST

అగ్రకథానాయకుల సినిమా అంటే అభిమానులంతా మంచి యాక్షన్‌ సినిమానే కోరుకుంటారు. అందుకే ఎక్కువ సార్లు అలాంటివే  తీసినా  అప్పుడప్పుడు సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ప్రయోగాలు చేస్తుంటారు కథానాయకులు. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ ఈ కోవలోకే వస్తుంది. ఇందులో రణ్‌వీర్‌కు జోడీగా ‘అర్జున్‌ రెడ్డి’ ఫేం షాలినీ పాండే నటించింది. దివ్యాంగ్‌ థక్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనీశ్‌ శర్మ నిర్మించారు. ఇది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న  సందర్భంగా రణ్‌వీర్‌ అంతరంగం ఆయన మాటల్లోనే...

‘‘పుట్టబోయే బిడ్డ ప్రాణాలకు అడ్డుగా నిలిచే ఒక సాధారణమైన వ్యక్తిగా ఇందులో నటించాను. ప్రస్తుత సమాజంలో ఇంకా అక్కడక్కడా ఉన్న భ్రూణ హత్యలపై వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమా ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషపడతారని నా నమ్మకం. ఇది సందేశాన్ని మాత్రమే ఇవ్వదు. పూర్తి వినోదాత్మక    అంశాలతో కమర్షియల్‌గానే ఉంటుంది.’’

‘‘నా చిత్రం ద్వారా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎందుకంటే సినిమాకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని పూర్తిగా నమ్ముతాను. మీరు నమ్మరు కానీ  కొన్ని చిత్రాలు చూసిన తర్వాత నా ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలా ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ చూసాకా కొంత మంది ఆలోచనాధోరణి మారినా నాకు సంతోషమే.’’


‘‘2018లో దర్శకుడు రోహిత్‌ శెట్టి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘సింబా’. దీనికి సీక్వెల్‌ తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరం కలిసి ‘సర్కస్‌’ తెరకెక్కుతోంది. అది పూర్తయిన తర్వాత ‘సింబా2’ మొదలు పెట్టే అవకాశాలున్నాయి. ఇందులో మాస్‌ కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉండేలా చూస్తాం.’’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని