Published : 20 Sep 2021 22:17 IST

Ranveer singh: దీపిక ఒక ‘క్వీన్‌’

ముంబయి: బాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో ఒకటి దీపిక-రణ్‌వీర్‌ది.ప్రస్తుతం ‘సూర్యవంశీ’, ‘83’, ‘జయేశ్‌భాయ్ జోర్దార్’, ‘సర్కస్‌’, ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని’.. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు రణ్‌వీర్‌..  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల కోసం Q&A చిట్‌చాట్‌ పెట్టారు. ఇది పెట్టింది ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకైతే.. భార్య దీపికా, నటుడు అర్జున్‌కపూర్‌ సైతం అభిమానుల్లా చేరి సరదా ప్రశ్నలు అడిగి ఆటపట్టించారు. మరి వాటికి రణ్‌వీర్‌ తనదైన శైలిలో ఇలా జవాబిచ్చారు..

అర్జున్‌ కపూర్‌: అవును భయ్యా.. మీరింత సెక్సీగా ఎలా ఉంటున్నారు?
రణ్‌వీర్‌ సింగ్‌: ఇదంతా నీ ట్రైనింగ్‌ కదా భయ్యా!

దీపికా పదుకొణె: ఏవండి! ఇంటికి ఎప్పుడు వస్తారు?
రణ్‌వీర్‌: వేడివేడి వంట వండి ఉంచు బేబీ.. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా!

నెటిజన్లు అడిగన ప్రశ్నలు ఇలా..

ఇక ఫుడ్‌ విషయంలో న్యుటెల్లా లేదా లోటస్‌ బిస్‌కాఫ్‌. ఏది ఇష్టపడతారు?
ఈ రెండు కాదు.. ఉడకపెట్టిన కూరగాయలు తింటా

మీ ముద్దు పేరు ఏంటి?
రాంబో

డైట్‌లో భాగంగా ఏమి తీసుకుంటారు?
ప్రస్తుతానికి పూర్తిగా శాకాహారమే

ఏవైనా ఆటలు ఆడతారా
బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ 

మీకు బాగా నచ్చిన సిరీస్‌ ఏంటి?
హెబీఓ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘సక్సెషన్‌’. దీని కొత్త ట్రైలర్‌ విడుదలైంది. మాములుగా లేదు మీరు చూడండి.

మీ భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..
దీపిక ఒక ‘క్వీన్‌’

టైం పాస్‌ కోసం ఏమి చేస్తారు?
వీడియో గేమ్స్‌ ఆడుతా

మీ ఫేవరేట్‌ సింధి ఫుడ్‌ ఏది
సింధి కర్రీతో పాటు బూందీ, రైస్‌తో కలిపి తింటి తింటే ఆ రుచే వేరు 

మీ ఆల్‌టైం ఫేవరేట్‌ మూవీ
 
1997లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’’

మీకు బాగా ఇష్టమైన పాట
ప్రస్తుతానికి సింగర్‌ దిల్జిత్‌ దోసంజ్‌ ఆలపించిన ‘లవర్‌’ సాంగ్ బాగా నచ్చింది. 


 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని