Ranveer singh: న్యూడ్‌ ఫొటోషూట్‌.. రణ్‌వీర్‌సింగ్‌ ఇంటికి పోలీసులు!

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫొటోలు (Nude photos) పోస్ట్‌ చేసిన వ్యవహారంలో ....

Published : 13 Aug 2022 01:27 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫొటోలు (Nude photos) పోస్ట్‌ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో విచారణకు రావాలని సూచించారు. ఇందులో భాగంగా ముంబయి పోలీసుల బృందం రణ్‌వీర్‌ నివాసానికి వెళ్లి అతడికి నోటీసులు అందజేసింది. ఈ నెల 22న విచారణ కోసం చెంబూరు పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. రణ్‌వీర్‌ తన నగ్న ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు వారిని అవమానపరిచారంటూ ఓ ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెలాఖరులో రణ్‌వీర్‌ ఓ మ్యాగజీన్‌ కోసం నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో వాటిని చూసిన నెటిజన్లు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ రణ్‌వీర్‌ సింగ్‌పై ఫిర్యాదు రావడంతో తాజాగా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని