Ranveer Singh: న్యూడ్‌ ఫొటోషూట్‌ కేసు.. ఫొటో మార్ఫింగ్‌ చేశారన్న రణ్‌వీర్‌సింగ్‌?

ఓ ప్రముఖ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో భాగంగా నూలుపోగులేకుండా కనిపించి, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఓ ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 16 Sep 2022 01:22 IST

ముంబయి: ఓ ప్రముఖ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో భాగంగా నూలుపోగులేకుండా కనిపించి, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh) అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆయనపై కేసు నమోదైన విషయం విధితమే. ఓ ఎన్జీవో సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెంబూర్‌ పోలీసులు కేసు నమోదు చేయగా.. రణ్‌వీర్‌ ఇటీవల విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను రెండు గంటలపాటు విచారించారని తెలిసింది. తాను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోల్లో ఒకదాన్ని ఎవరో మార్ఫింగ్‌ చేసి, ఆ ఫొటోని వైరల్‌ చేశారని రణ్‌వీర్‌ పోలీసులకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. ప్రైవేటు పార్ట్స్‌ కనిపించేలా తాను ఫొటోషూట్‌ చేయలేదని చెప్పినట్టు తెలిసింది.

రణ్‌వీర్‌ సింగ్‌ తన ఫొటోలను జులై 22న సోషల్‌ మీడియాలో ఉంచారు. ‘ఇలా మీ ఒక్కరికే సాధ్యం’, ‘ఫైర్‌’, ‘చెప్పేందుకు మాటల్లేవ్‌’ అంటూ కొందరు ఆయన్ను పొగడ్తల్లో ముంచారు. మరికొందరు రణ్‌వీర్‌పై విమర్శలు గుప్పించారు. జులై 26న విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు పంపగా.. రణ్‌వీర్‌ కొన్ని రోజులు గడువు తర్వాత హాజరయ్యారు. సినిమాల విషయానికొస్తే.. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ నటిస్తోన్న ‘సర్కస్’ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదలకానుంది. ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ అనే సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని