Ranveer Singh: బేర్‌ గ్రిల్స్‌తో రణ్‌వీర్ సాహసం.. ట్రైలర్‌ చూశారా..!

‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌. సెలబ్రిటీలతో ఆయన అడవుల్లో అడ్వంచర్‌ చేయిస్తుంటారనే సంగతి తెలిసిందే.

Published : 25 Jun 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ (Bear Grylls). సెలబ్రిటీలతో ఆయన అడ్వెంచర్‌ చేయిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి తాజాగా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) చేరారు. ఈ ఇద్దరి సాహసోపేతమైన ప్రయాణానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఎత్తైన కొండలను ఎక్కడం, క్రూర మృగాల నుంచి తప్పించుకోవడాన్ని చూస్తే వీరి ధైర్యాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఈ జర్నీ ఎంత భయానకంగా ఉంటుందో ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ‘చూస్తున్న మనకే ఇలా ఉంటే వారి పరిస్థితి ఏంటి?’ అనే సందేహం కలగక మానదు. ఈ ఉత్కంఠ భరిత సన్నివేశాలే కాదు రణ్‌వీర్‌ చేసిన సందడినీ ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. ఈ వేదికగా తన సతీమణి దీపికా పదుకొణెపై ఎంత ప్రేమ ఉందో రణ్‌వీర్‌ మరోసారి చాటిచెప్పారు. ‘‘జై భజరంగ్‌ భళి’’ అంటూ బేర్‌ గ్రిల్స్‌లో రణ్‌వీర్‌ ఉత్సాహాన్ని నింపారు. ఈ ఎపిసోడ్‌ జులై 8న ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదలకానుంది. బేర్‌ గ్రిల్స్‌ గతంలో.. ప్రధాని నరేంద్ర మోదీ, రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌ తదితరులతో సాహస యాత్ర చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని