KGF Chapter2: రావు రమేశ్ పాత్ర ఇదే

 తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2 ఒక‌టి.య‌శ్ హీరోగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టుడు రావు ర‌మేశ్ కీల‌క  పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Published : 26 May 2021 01:11 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘కేజీయఫ్ ఛాప్ట‌ర్ 2’ ఒక‌టి. య‌శ్ హీరోగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టుడు రావు ర‌మేశ్ కీల‌క  పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. నేడు ర‌మేశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆయ‌న లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో క‌ళ్లద్దాలు పెట్టుకుని, కోటు ధ‌రించి సీరియ‌స్ గా కనిపించారు ర‌మేశ్. ఈ చిత్రంలో ఆయ‌న సీబీఐ అధికారి క‌న్నెగంటి రాఘ‌వ‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. గ‌తంలో ప్ర‌శాంత్ నీల్‌- య‌శ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘కేజీయఫ్ ఛాప్ట‌ర్ 1’ కి కొన‌సాగింపు ఈ చిత్రం. శ్రీనిధి శెట్టి నాయిక‌. ర‌వీనా టాండ‌న్, సంజ‌య్ద‌త్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిల్స్మ్ ప‌తాకంపై విజ‌య్ కిరంగ‌దూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులై 16న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.


మహా సముద్రం లో ఇలా..

శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా తెరకెక్కుతోన్న చిత్రం మహా సముద్రం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గూని బాబ్జీ అనే వైవిధ్య పాత్ర పోషిస్తున్నారు రమేశ్. జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన పోస్టర్ ని పంచుకుంది చిత్ర బృందం. ట‌క్ చేసుకుని సీరియస్ లుక్ ద‌ర్శ‌న‌మిచ్చి సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నారు. స‌వాలు విసిరే పాత్ర ఇది చిత్ర వ‌ర్గాలు తెలిపాయి. ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా ఏకే ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, అదితి రావు హైద‌రీ నాయిక‌లు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని