RAPO19 ఆడియో హక్కులు.. రామ్‌ కెరీర్‌లోనే రికార్డు ధర..!

రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రామ్‌ సరసన ‘ఉప్పెన’ హీరోయిన్‌ కృతిశెట్టి సందడి చేయనుంది. ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నాడు. మరో భామ అక్షరగౌడ ప్రత్యేకార్షణ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

Updated : 04 Aug 2021 09:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రామ్‌ సరసన ‘ఉప్పెన’ హీరోయిన్‌ కృతిశెట్టి సందడి చేయనుంది. ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నాడు. మరో భామ అక్షరగౌడ ప్రత్యేకార్షణ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. RAPO19 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోందీ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. కాగా.. సినిమా ఆడియో హక్కులకు రికార్డు ధర లభించినట్లు తెలుస్తోంది. దీని కోసం ‘ఆదిత్య మ్యూజిక్‌’ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ ఆడియో హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే రామ్‌ కెరీర్‌లో ఆడియో హక్కుల విషయంలో ఈ సినిమాదే రికార్డు అవుతుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని