#RAPO19 రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్న రామ్‌

వరుస హిట్లతో మంచి జోష్‌ మీద కనిపిస్తున్నాడు టాలీవుడ్‌ యువ కథనాయకుడు రామ్‌ పోతినేని. మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. తన తర్వాతి సినిమాను ఇప్పటికే కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు.

Published : 07 Jul 2021 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస హిట్లతో మంచి జోష్‌ మీద కనిపిస్తున్నాడు టాలీవుడ్‌ యువ కథనాయకుడు రామ్‌ పోతినేని. మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. తన తర్వాతి సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందట. చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కాగా.. కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ చిన్నది కృతిశెట్టి హీరోయిన్‌గా సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని