Rashmi: వాడి లవర్‌ వాడి ఇష్టమట.. ఆ కామెంట్స్‌ చూస్తే సిగ్గుగా ఉంది : రష్మి

నటుడు నాగశౌర్య (Naga Shaurya) వైరల్‌ వీడియోపై నటి, యాంకర్‌ రష్మి (rashmi) స్పందించారు. నెటిజన్ల తీరును ఆమె తప్పుబట్టారు.

Updated : 01 Mar 2023 11:37 IST

హైదరాబాద్‌: ఓ యువకుడు తన ప్రియురాలిని నడిరోడ్డుపై కొట్టడం పట్ల నటుడు నాగశౌర్య (Naga Shaurya) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రియురాలైనా సరే.. ఆ అమ్మాయికి సారీ చెప్పాల్సిందేనంటూ ఆయన వాగ్వాదానికి దిగిన ఓ వీడియో మంగళవారం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన పట్ల నెటిజన్లు స్పందించిన తీరుపై నటి రష్మి (Rashmi) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అమ్మాయి ఎలాంటి బాధను అనుభవిస్తుందో ఎవరికి తెలుసు అంటూ వ్యాఖ్యానించింది.

తన ప్రియురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువకుడు నడిరోడ్డుపై ఆమెపై చేయి చేసుకున్న ఘటన ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అదే ఆసమయంలో అటుగా వెళ్తోన్న నాగశౌర్య (Naga Shaurya).. ఆ యువకుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? ఆమెకు సారీ చెప్పు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు కురిపించారు. ‘లవర్స్‌ అన్నాక వంద ఉంటాయి. వాళ్ల విషయాల్లో తల దూర్చడం అవసరమా?’ అంటూ నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై తాజాగా రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘వాడి లవర్‌ వాడి ఇష్టమట.. అమ్మాయే సపోర్ట్‌ అట.. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్‌ చూస్తే సిగ్గుగా ఉంది. ఆ అమ్మాయి ఎలాంటి ఒత్తిడిని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు. మరో ఆత్మహత్య జరగడం కోసం మీరు ఎదురుచూస్తున్నారా?’’ అని ఆమె (rashmi) ట్వీట్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు