Rashmi: ‘ఊ అంటావా మావ’ అంటూ రష్మి.. సామి సామి అంటూ వర్ష అదరగొట్టారు!

నటిగా, వ్యాఖ్యాతగా యువత మనసుదోచే అందాల భామ రష్మి గౌతమ్‌. బుల్లితెరపై ఆమెకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Updated : 16 Jan 2022 09:05 IST

హైదరాబాద్‌: నటిగా, వ్యాఖ్యాతలుగా యువత మనసుదోచే అందాల భామలు రష్మి గౌతమ్‌, వర్ష. బుల్లితెరపై వాళ్లకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే పలు షోలలో వ్యాఖ్యాతలుగా చేస్తూనే అప్పుడప్పుడు వాళ్లు ఇచ్చే డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌లు మతిపోగొడతాయి. తాజాగా వీరిద్దరూ తనదైన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తో అలరించారు.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో ‘ఊ అంటావా మావ’ పాటలో సమంత ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాటకు ‘అమ్మమ్మగారి ఊరు’ కార్యక్రమంలో నర్తించి మెస్మరైజ్‌ చేసింది రష్మి. అదే విధంగా ‘సామి సామి’ పాటకు వర్ష చేసిన డ్యాన్స్‌ సైతం అలరించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ‘ఈటీవీ’లో టెలికాస్ట్‌ అయిన ఈ ఈవెంట్‌ ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా ‘ఊ అంటావా మావ’ పాటకు రష్మి, ‘సామి సామి’ పాటకు వర్ష డ్యాన్స్‌ చేస్తూ పలికించిన హావభావాలు యువత హృదయాలను కొల్లగొడుతున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని