
Rashmi: జూ సిబ్బందిపై రష్మీ ఆగ్రహం..
హైదరాబాద్: మూగజీవాలపై ఎంతో ప్రేమను కనబరుస్తుంటారు నటి, వ్యాఖ్యాత రష్మీ. మూగజీవాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ తరచూ ఆమె పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఓ జూలో జరిగిన ఘటన పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది. దాన్ని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్ నుంచి బయటకు తల పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ షేర్ చేయగా.. అది చూసిన రష్మీ ఆగ్రహానికి లోనయ్యారు. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో మూడు నెలలపాటు ఇంట్లో ఉండటానికి మనం ఎంతో ఇబ్బందిపడ్డాం. అలాంటిది జీవితాంతం వాటిని బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఒక్కసారి ఆలోచించండి’’ అంటూ రష్మీ పోస్ట్ పెట్టారు. బ్యాన్ జూ అనే ట్యాగ్‌ని జత చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.