Rashmi: ‘సుధీర్‌తో ప్రేమా, పెళ్లా?’: రష్మి సమాధానమేంటంటే?

సుడిగాలి సుధీర్‌తో తనకున్న అనుబంధంపై రష్మి మరోసారి స్పందించారు. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని అన్నారు.

Published : 08 Nov 2022 01:43 IST

హైదరాబాద్‌: ‘నా గురించి అందరికీ వివరిస్తుంటే అసలు అది నా జీవితమే అవదు. అన్ని విషయాల్ని చెప్పాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగతం’ అని రష్మి (Rashmi Gautam) అన్నారు. వ్యాఖ్యాత, నటుడు సుడిగాలి సుధీర్‌ (Sudigaali Sudheer)తో తనకున్న సంబంధం గురించి ప్రశ్న ఎదురవగా ఆమె స్పందించారు. రష్మి, నందు జంటగా నటించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా వారిద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

‘సుధీర్‌, రష్మికి మధ్య ఉంది స్నేహమా, ప్రేమా?, పెళ్లి ఆలోచన ఉందా?’ అని అడగ్గా.. ‘‘మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది’’ రష్మి తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని