NMACC Launch: ఎన్‌ఎంఏసీసీ స్టేజ్‌పై ‘నాటు నాటు’.. డ్యాన్స్‌తో అదరగొట్టిన షారుఖ్‌, అలియా, రష్మిక

ఎన్‌ఎంఏసీసీ (NMACC) ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన కల్చరల్‌ ఈవెంట్స్‌లో సెలబ్రిటీలు సందడి చేశారు. బాలీవుడ్‌ పాటలకు స్టెప్పులేసి అలరించారు.

Published : 02 Apr 2023 10:51 IST

ముంబయి: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్‌ ‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌)లో సినీ తారలు సందడి చేశారు. ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సినీ తారలు పెద్ద ఎత్తున పాల్గొని డ్యాన్సులతో అలరించారు. షారుఖ్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకచోప్రా, అలియాభట్‌, రష్మిక తదితరులు పలు బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ పాటలకు డ్యాన్సులు చేసి ఉర్రూతలూగించారు.

‘పఠాన్‌’ టైటిల్‌ సాంగ్‌కు షారుఖ్‌ స్టెప్పులేయగా.. హాల్‌లో ఉన్న ప్రముఖులందరూ చప్పట్లు కొడుతూ ఆయన్ను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన ‘నాటు నాటు’(Naatu Naatu)కు సైతం కాలు కదిపారు. మరోవైపు, ఇదే వేదికపై బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక ‘నాటు నాటు’ (హిందీ వెర్షన్‌)కు డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, ఈ వేడుకల్లో సీనియర్‌ నటి రేఖ, బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌, శ్రద్ధాకపూర్‌, హృతిక్‌ రోషన్‌, నటి సబా అజాద్‌, కాజోల్‌, కృతిసనన్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు పాల్గొన్నారు. భారతీయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటైంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని