Rashmika: ‘యానిమల్‌’లో రష్మిక

రణ్‌బీర్‌ కపూర్‌- సందీప్‌రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న చిత్రం ‘యానిమల్‌’. ఏప్రిల్‌ చివరి వారంలో దీని చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated : 03 Apr 2022 08:07 IST

ణ్‌బీర్‌ కపూర్‌- సందీప్‌రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న చిత్రం ‘యానిమల్‌’. ఏప్రిల్‌ చివరి వారంలో దీని చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ  నేపథ్యంలో ఉగాది సందర్భంగా శనివారం ఈ సినిమాలో నటించనున్న కథానాయిక పేరును అధికారికంగా ప్రకటించారు. రష్మిక మందన్న ఇందులో కథానాయిక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇది ముంబయిలోని ఓ గ్యాంగ్‌స్టర్‌ కుటుంబం నేపథ్యంలో తెరకెక్కుతున్న కథగా తెలుస్తోంది. దీనికోసం సందీప్‌రెడ్డి ఇప్పటికే ముంబయిలో పలు లొకేషన్లను పరిశీలించారు. ‘యానిమల్‌’లో అనిల్‌కపూర్‌తో పాటు, బాబీడియోల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 ఆగస్టు 11న విడుదల చేయాలని సంకల్పించింది చిత్రబృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని