Rashmika: హారర్‌ చిత్రంలో రష్మిక?

త్వరలో ‘పుష్ప 2’తో ప్రేక్షకులను పలకరించనున్న అందాల తార రష్మిక... ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా కోసం జతకట్టినట్లు సమాచారం.

Published : 26 Jun 2024 01:46 IST

త్వరలో ‘పుష్ప 2’తో ప్రేక్షకులను పలకరించనున్న అందాల తార రష్మిక... ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా కోసం జతకట్టినట్లు సమాచారం. దినేష్‌ విజన్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ‘‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దినేష్‌ విజన్‌తో తన రాబోయే ప్రాజెక్టు కోసం కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు ఆయుష్మాన్‌. ఈ చిత్రానికి ఆదిత్య సత్పోదర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్‌తో జతకట్టడానికి రష్మికను ఎంపిక చేసింది చిత్రబృందం. తొలిసారి కలిసి నటిస్తున్న ఈ హారర్‌ కామెడీలో వీరిద్దరు మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నారు. మడాక్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ‘వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్కిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని