Rashmika: వెల్‌డన్‌ విజయ్‌.. ‘లైగర్‌’పై రష్మిక వైరల్‌ కామెంట్స్‌

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘లైగర్’ (Liger) చిత్రంపై నటి రష్మిక (Rashmika) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.

Published : 01 Oct 2022 11:37 IST

ముంబయి‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘లైగర్’ (Liger) చిత్రంపై నటి రష్మిక (Rashmika) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తనకెంతగానో నచ్చిందన్నారు. ‘గుడ్‌ బై’ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన రష్మిక.. విజయ్‌ దేవరకొండతో తన రిలేషన్‌షిప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘విజయ్‌తో ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలు చేశాను. దీంతో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఇప్పుడు అందరూ ‘రష్మిక విజయ్‌ దేవరకొండ’ అంటూ మా గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇక, విజయ్‌ నటించిన ‘లైగర్‌’ చిత్రాన్ని ఇటీవల చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు మాస్‌ సినిమాలు చాలా ఇష్టం. ‘లైగర్‌’ చూస్తున్నప్పుడు.. విజిల్స్‌ వేశాను. డ్యాన్స్ చేశాను. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా ఎంతో నచ్చింది. విజయ్‌ అదరగొట్టేశాడు. ఫిట్‌నెస్‌పై అతడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్‌డన్‌ విజయ్‌’’ అని రష్మిక వివరించారు.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘లైగర్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దీన్ని తెరకెక్కించారు. రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యా పాండే కథానాయిక. భారీ అంచనాల మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని