Rashmika : మరోసారి పారితోషికం అమాంతం పెంచేసిన ‘శ్రీవల్లి’?
తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ పుష్పా సుందరి తన రెమ్యునరేషన్‌ను మరోసారి పెంచేసిందిట.
ఇంటర్నెట్‌డెస్క్: తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘శ్రీవల్లి’ తన రెమ్యునరేషన్‌ను మరోసారి పెంచేసిందట. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’లో, అలాగే సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’లోనూ నటిస్తుంది. రణ్వీర్ కపూర్ సినిమాలోనూ రష్మిక ఓ పాత్రలో మెరవబోతుంది. ఇక ‘పుష్ప2’ సినిమా కోసం రష్మిక 4 కోట్ల రూపాయలు తీసుకోనుందట. ఈ సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని పెంచేసి ఇక పై ఒక్కో సినిమాకు 5కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన అన్ని చోట్ల భారీ స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల నిర్వహించిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)వేడుకల్లో ఆరు అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక