Rashmika : ఈ ఫొటోలన్నీ తీసుకుని ఏం చేస్తారు? ఫ్యాన్స్‌ హార్ట్‌ గెలుచుకున్న రష్మిక

తనని చూడటానికి వచ్చిన అభిమానుల పట్ల రష్మిక వ్యవహరించిన తీరు అందరితోనూ చప్పట్లు కొట్టేలా చేయిస్తోంది.

Updated : 14 Jun 2022 13:01 IST

ముంబయి: తనని చూడటానికి వచ్చిన అభిమానుల పట్ల రష్మిక వ్యవహరించిన తీరు అందరితోనూ చప్పట్లు కొట్టేలా చేయిస్తోంది. ఫొటో దిగేందుకు వస్తోన్న అభిమానిని బౌన్సర్‌ అడ్డుకోవడంతో వదలమని చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తాజాగా ఓ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న రష్మికను చూడటానికి ఆమె అభిమానులు స్టూడియోకు వచ్చారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత వ్యానులోకి వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి నిలబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని ఫొటో దిగేందుకు రష్మిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన రష్మిక.. అతడిని వదలమని ఆదేశించారు. ఈ ఫొటోలన్నీ తీసుకుని ఏం చేస్తారు? అని అభిమానిని అడిగి అతడితో ఫొటో తీసుకుంది.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

రష్మిక తెలుగుతో పాటూ ఇతర భాష చిత్రాల్లోనూ నటిస్తున్నారు. విజయ్‌-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతో పాటు, సిద్ధార్థ్‌ మల్హోత్ర మిషన్‌ మజ్ను, అమితాబ్‌ ‘గుడ్‌ బై’, దుల్కర్‌సల్మాన్‌‘సీతా రామమ్‌’ అల్లు అర్జున్ ‘పుష్ప-2’చిత్రాల్లో నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని