Pushpa 2: అప్‌డేట్‌ కావాలా పుష్ప.. ‘పుష్ప2’ షూటింగ్‌ గురించి చెప్పిన రష్మిక

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప2’(Pushpa 2). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా రష్మిక(Rashmika) ఈ మూవీ గురించి మాట్లాడింది. 

Published : 16 Jan 2023 17:14 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌(Allu Arjun) సరసన రష్మిక(Rashmika Mandanna) నటించిన ‘పుష్ప’ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్‌బాస్టర్‌ అయిందో తెలిసిన విషయమే. సుకుమార్‌(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోట్లు వసూళ్లు చేసి విదేశాల్లోనూ సత్తా చాటింది. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 (Pushpa 2: The Rule)ని అనౌన్స్ చేశారు. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇస్తారని అభిమానులు ఆశ పడ్డారు. కనీసం సంక్రాంతికైనా ఏదోక ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ చిత్రబృందం మాత్రం ఎలాంటి హడావిడి చేయలేదు. దీంతో ‘అప్‌డేట్‌ ఏది పుష్ప’ అంటూ సోషల్‌మీడియాలో మీమ్స్‌ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ‘పుష్ప2’(Pushpa 2) గురించి మాట్లాడింది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైందని చెప్పిన ఈ శ్రీవల్లి.. తాను వచ్చే నెల నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపింది. అంతేకాదు రెండో భాగం కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. ఇక పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు వరస ఆఫర్లు అందుకుంటోంది. ఇటీవలే విజయ్‌ సరసన వారసుడులో కనిపించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మ అగ్రహీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల అమితాబ్‌ సినిమాలో అలరించిన రష్మిక ప్రస్తుతం సిద్ధార్థ్‌ మల్హోత్ర(Sidharth Malhotra)తో కలిసి మిషన్‌ మజ్ను(Mission Majnu) సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని