Rashmika: ఆస్కార్‌కు వెళ్లని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. రష్మిక ఏమన్నారంటే

భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయం అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఆస్కార్‌కు నామినేట్‌ కాకపోవడంపై నటి రష్మిక (Rashmika) స్పందించారు.

Published : 01 Oct 2022 02:25 IST

ముంబయి: భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయం అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఆస్కార్‌కు నామినేట్‌ కాకపోవడంపై నటి రష్మిక (Rashmika) స్పందించారు. ‘‘ఎలాంటి భేదాలు లేకుండా సినిమాను మనందరం సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. గతంలో నేను నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా ఆస్కార్‌ నామినేషన్‌ కోసం పరిశీలనకు వెళ్లింది. కాకపోతే ఆస్కార్‌ నామినేషన్‌ వరకూ వెళ్లలేదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు దానిపై అభిమానాన్ని చూపారు. ఈ చిత్రానికి వచ్చిన భారీ వసూళ్లు, దక్కిన అభిమానాన్ని మనందరం సెలబ్రేట్‌ చేసుకోవాలి’’ అని రష్మిక తెలిపారు. విజువల్‌ వండర్‌గా రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ ఏడాది ఆస్కార్‌కు వెళ్లే అవకాశం ఉందని పలు హాలీవుడ్‌ మ్యాగజైన్స్‌, సినీ ప్రియులు అభిప్రాయ పడ్డారు. కానీ.. వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ ఆస్కార్‌కు వెళ్లింది. 

రష్మిక ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘గుడ్‌బై’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నీనాగుప్తా కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె అమితాబ్‌ బచ్చన్‌ కుమార్తెగా కనిపించనున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts