Rashmika Mandanna: అల్లు అర్జున్‌ను వెనక్కి నెట్టి.. టాప్‌-3లో నిలిచిన రష్మిక..!

Rashmika Mandanna: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే రష్మిక తాజాగా ఐఎండీబీ ర్యాంకుల్లోనూ అదరగొట్టింది. చాలా మంది పాపులర్‌ సెల్రబిటీలను వెనక్కి నెట్టి టాప్‌-3లో నిలిచింది.

Published : 15 Apr 2023 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ కథానాయిక రష్మిక మందన (Rashmika) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్‌మీడియాలోనూ అభిమానులను తరచూ పలకరిస్తుంటుంది. ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న ఈ భామ ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. సినిమాలను విశ్లేషించి ర్యాంకులు ఇచ్చే ఐఎండీబీలో ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్‌-3లో నిలిచింది. ఇటీవలే రష్మిక బర్త్‌డే, ‘పుష్ప2’ గ్లింప్స్‌ విడుదల కావడంతో రష్మిక గురించి ఇంటర్నెట్‌ వేదికగా అత్యధికమంది మాట్లాడుకునేలా చేశాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఐఎండీబీ తన ట్విటర్‌ వేదికగా ర్యాంకులను విడుదల చేసింది. రష్మిక తొలిసారి టాప్‌-3లోకి రావడం గమనార్హం.  కొత్త జాబితాలో 11వ స్థానంలో తమిళ దర్శకుడు వెట్రిమారన్‌, ఉండగా ‘పుష్ప’తో జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్‌ 17వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ (31) తమన్నా (33) కరీనా (34), నాని (49), కీర్తి సురేశ్‌ (50)లు ఉన్నారు. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా తెలుగు, తమిళ భాషల్లో ‘రెయిన్‌బో’, నితిన్‌- వెంకీ కుడుముల మూవీ, హిందీలో ‘యానిమల్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని