Rashmika: మనుషులందరినీ ఒకేలా చూస్తా.. అందుకే వాళ్ల కాళ్లకు దండం పెడతా: రష్మిక
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తాను మనుషులందరినీ ఒకేలా చూస్తానని తెలిపింది. ఇంట్లో పనిచేసే వాళ్ల కాళ్లకు కూడా దండం పెడతానని చెప్పింది.
హైదరాబాద్: తన నటనతో , డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది రష్మిక (Rashmika). టాలీవుడ్లో సూపర్ హిట్లు అందుకుంటూనే బాలీవుడ్‌లోనూ తన హవా చూపుతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ వాళ్లలో జోష్ నింపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడిన మాటలకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
‘నేను ప్రతి చిన్న విషయాన్ని పాటిస్తున్నాను. ఉదయాన్నే నిద్ర లేవడం. కాసేపు పెంపుడు శునకాలతో ఆడుకోవడం.. వీలుకుదిరినప్పుడల్లా స్నేహితులను కలవడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాలే నన్ను ఎంతో ఆనందంగా ఉంచుతాయి. మాట అనేది ఎంతో శక్తిమంతమైనది. ఒక మనిషిని బాధపెట్టాలన్నా, బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నా అది మనం మాట్లాడే విధానంపైనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతుంటా. అందుకే ఎవరైనా ఏదైనా చెబితే.. దాన్ని నేను కచ్చితంగా వింటాను. ప్రతి విషయాన్నీ డైరీలో నోట్ చేసుకుంటా. అలాగే కుటుంబంలోని పెద్దవాళ్ల కాళ్లకు ప్రతి రోజూ నమస్కారం చేస్తా. అదేవిధంగా మా ఇంట్లో పనిచేసేవాళ్ల కాళ్లకు నమస్కారం చేస్తా. ఎందుకంటే నేను మనుషులందరినీ ఒకేలా చూస్తాను. అందరికీ గౌరవం ఇస్తాను’’ అని రష్మిక చెప్పింది.
ఇటీవల మిషన్ మజ్నుతో అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2’ (Pushpa 2) షూటింగ్‌తో బిజీగా గడుపుతోంది. తాజాగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో నితిన్ (Nithin) సరసన నటించేందుకు మరో సినిమాను ఓకే చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు