Rashmika: రష్మికపై నెటిజన్లు ఫైర్‌

‘పుష్ప’తో తన కెరీర్‌లో మరో విజయాన్ని అందుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్‌’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రష్మిక బాలీవుడ్‌పైన ఫోకస్‌ పెట్టారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న తన తదుపరి చిత్రాల...

Published : 24 Jan 2022 14:32 IST

ముంబయి: ‘పుష్ప’తో తన కెరీర్‌లో మరో విజయాన్ని అందుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్‌’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రష్మిక బాలీవుడ్‌పైన ఫోకస్‌ పెట్టారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న తన తదుపరి చిత్రాల కోసం ఆమె అన్నివిధాలుగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ చిత్రాల షూటింగ్‌ నిమిత్తం గత కొన్నిరోజులుగా కుటుంబానికి దూరంగా ముంబయిలోనే ఉంటున్నారు. కాగా, ఇటీవల ఆమె షూట్‌ నుంచి కాస్త విరామం తీసుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడిపారు. వెకేషన్‌ అనంతరం తాజాగా ఆమె ముంబయి చేరుకున్నారు.

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూసిన ఫొటోగ్రాఫర్లు.. ‘శ్రీవల్లి శ్రీవల్లి’ అంటూ పిలిచారు. అందుకు ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. రష్మికకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటంటే.. ఆమె వేసుకున్న దుస్తులు. ఆమె ధరించిన స్వెట్‌ టీషర్ట్‌, డెనిమ్‌ షార్ట్‌ మరీ చిన్నగా ఉండటంతో నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టేశారు. ‘‘ఆమె దుస్తులు పూర్తిగా వేసుకోవడం మర్చిపోయినట్టు ఉన్నారు’’, ‘‘ఈ మధ్య అందరూ పూర్తిగా దుస్తులు వేసుకోకుండానే తాము రెడీ అయిపోయామనే భ్రమలో ఉంటున్నారు’’, ‘‘ఆమె ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాం’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని